కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కుట్విట్టర్ షాకిచ్చింది. ఇటీవల ట్విట్టర్.., కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ– కాశ్మీర్ లో లఢక్‌లోని కొన్ని కీలక ప్రదేశాలను డ్రాగన్ కంట్రీకి చెందినవేనంటూ గుర్తించింది. దీంతో కేంద్రం ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులతో అప్రమత్తమైన ట్విట్టర్ తన మ్యాప్ ను సరిచేసింది. తాజాగా అమిత్ షా ట్విట్టర్ అకౌంట్ ను టెంపరరీగా ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేయడం మరింత వివాదంగా మారింది.
అయితే అమిత్ షా ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయడంపై ట్విట్టర్ ఇండియా స్పందించింది. కాపీరైట్స్ పాలసీ ప్రకారం తాము అమిత్ షా ట్విట్టర్ అకౌంట్ ను టెంపరరీగా బ్లాక్ చేసినట్లు తెలిపింది. అమిత్ షా ట్విట్టర్ ప్రొఫైల్ పిచ్చర్ తానే తీసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కాపీరైట్స్ పాలసీ కింది బ్లాక్ చేసినట్లు .. అనంతరం దాన్ని రీస్టోర్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.
