జమ్మూ కాశ్మీర్‌‌లో ఈ ఏడాది 75 మంది టెర్రరిస్టులు ఎన్​కౌంటర్

  • చనిపోయిన వారిలో 60% మంది పాకిస్తాన్‌‌ వాళ్లే 
  • ప్రతి ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ హతం

జమ్మూ కాశ్మీర్‌‌: ఈ ఏడాది ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్‌‌లో 75 మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు ఎన్​కౌంటర్​చేశాయి. హతమైన వారిలో 60 శాతం మంది పాకిస్తాన్‌‌కు చెందినవారే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఆర్మీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రతి ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్​ను  భద్రతా బలగాలు అంతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

 ఇప్పటివరకు మరణించిన 75 మందిలో అత్యధికులు విదేశీయులే ఉన్నారని తెలిపారు. వీరిలో నియంత్రణ రేఖ (ఎల్‌‌ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి చొరబాటుకు యత్నించిన 17 మంది, అంతర్గత ప్రాంతాల్లో ఎన్‌‌కౌంటర్లలో 26 మంది టెర్రరిస్టులు హతమైనట్టు తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో (జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరి) 42 మంది టెర్రరిస్టులు చనిపోయారని.. వారిలో స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.