ఏపీలో కూటమి హవా.. ప్రతిపక్ష హోదా కూడా రాని YSRCP

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం  పాలైంది. టీడీపీకి136, బీజేపీకి 8, జనసేన 21 సీట్లలో స్పష్టమైన ఆధిక్యతలు సాధించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అధికార వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. జగన్ క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులు కూడా ఓడిపోయారు. ఫలితాల సరళిని గమనించిన పలువురు మంత్రులు కౌంటింగ్ కేంద్రాల నుంచి అర్ధంతరంగా బయటికి వెళ్లిపోయారు. 

టీడీపీ సంబరాలు

ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో టీడీపీ సంబురాలు చేసుకుంటోంది. టీడీపీ కార్యకర్తలు పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ తీన్మార్ నృత్యాలు చేస్తున్నారు. 

ప్రధాన ప్రతిపక్ష హోదాపై నీలి నీడలు

ఫలితాల సరళి చూసిన తర్వాత వైకాపాకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 10  స్థానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది.  ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మరో రెండు స్థానాల్లో విజయం సాధించాలి.