ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : అలేఖ్య పుంజల

  • రాష్ట్ర సంగీత, నాట్య కళామండలి చైర్​పర్సన్​ అలేఖ్య పుంజల

నారాయణపేట, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర సంగీత, నాట్య కళామండలి చైర్​పర్సన్​ అలేఖ్య పుంజల పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్  సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్  వార్ల విజయ్ కుమార్ము

న్సిపల్  చైర్​పర్సన్​ గందే అనసూయ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయిని, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.