చనిపోతూ ఐదుగురిని బతికించిన చిన్నారి ధనిష్ట

చనిపోతూ ఐదుగురిని బతికించిన చిన్నారి ధనిష్ట

తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణం పోసింది ఓ చిన్నారి. ఢిల్లీకి చెందిన 20 నెలల చిన్నారి ధనిష్ట జనవరి 8న ఇంటి బాల్కనీ నుంచి కిందపడింది. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు పాప తల్లిదండ్రులు. గుండె,కాలేయం,కిడ్నీలు,కార్నియాలను ఐదుగురికి దానం చేశారు. తమ బిడ్డ చనిపోయినా ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది ధనిష్ట.