ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 74,422 కరోనా టెస్టులు నిర్వహించగా 3,746 మందికి పాజిటివ్ గా తేలింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 677 కొత్త కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 65 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 27 మంది చనిపోయారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,508కి పెరిగింది. తాజాగా, 7,739 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,93,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,54,415 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
