సైనికులకు.. సినిమా టికెట్లు ఫ్రీ!

సైనికులకు.. సినిమా టికెట్లు ఫ్రీ!
పాట్నాలో ఓ థియేటర్ ఆఫర్​ పాట్నా: దేశంకోసం ఎనలేని త్యాగాలు చేస్తున్న సోల్జర్లకు పాట్నాలోని ఓ సినిమా థియేటర్ యాజమాన్యం అరుదైన గౌరవం కల్పించింది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి జీవితాంతం సినిమా టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న సోల్జర్లతో పాటు రిటైర్ అయిన సోల్జర్లకూ టికెట్లను ఫ్రీగా ఇస్తామని, జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని పాట్నాలోని రీజెంట్ ఫన్ థియేటర్ ఓనర్ సుమన్ కె.సిన్హా చెప్పారు. మన కోసం బార్డర్​లో ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాస్తున్న సోల్జర్లను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సోల్జర్లు కౌంటర్​లో ఐడీ కార్డును చూపి ఫ్రీగా టికెట్లు తీసుకోవచ్చని లేదా ఆన్ లైన్ లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ఐటీబీపీ జవాన్లకు ఆన్​లైన్​లో లిక్కర్ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ బేస్డ్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను ఇండో–టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) స్టార్ట్ చేసింది. ఎల్ఏసీ వద్ద కాపలా ఉంటున్న ఐటీబీపీ జవాన్లకు, రిటైర్ అయిన వారికి కూడా లిక్కర్​ను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనుంది. రిమోట్ లొకేషన్స్​లో ఉండే జవాన్లు, రిటైర్డ్ జవాన్లకు క్వాలిటీ లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో ఉంచడానికి సెంట్రలైజ్డ్ లిక్కర్ మేనేజ్మెంట్ సిస్టం(సీఎల్ఎంఎస్)ను పారామిలిటరీ ఫోర్స్ గతంలోనే లాంచ్ చేసింది. జవాన్లు, ఆఫీసర్లు వారికి కావలసిన లిక్కర్​ను వారు పనిచేసే యూనిట్​కు దగ్గరలో ఉండే ఆథరైజ్డ్ క్యాంటీన్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేసే చాన్స్ ఉండేది. ఆన్​లైన్ సిస్టం ద్వారా జవాన్లు నెలకు 8 లిక్కర్ బాటిల్స్, 6 బీర్ క్యాన్స్ కొనుక్కోవచ్చు.