మానవపాడు అభ్యర్థికి  డీఎస్సీలో రెండు ర్యాంకులు

అలంపూర్, వెలుగు :  డీఎస్సీ ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి   చెందిన ఇమ్రాన్​ బాషా లాంగ్వేజ్ పండిట్​ పరీక్షలో  62 మార్కులు సాధించి జిల్లా సెకండ్ ర్యాంక్,  ఎస్జీటీలో  70 మార్కులు సాధించి జిల్లాలో 57 ర్యాంకు సాధించాడు.   కూలి పని చేసుకునే ఇబ్రహీం కుమారుడు షేక్ ఇమ్రాన్ బాషా డీఎస్సీ ఫలితాల్లో రెండు ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.    

తాను ఆన్​లైన్​లో  క్లాసులు  చెప్పుకుంటూ ..  వచ్చిన డబ్బుతో  డీఎస్సీకి  ప్రిపేర్ అయినట్లు  షేక్ ఇమ్రాన్ బాషా తెలిపాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకుంటే ఏదో ఒక రోజు ఉద్యోగం సాధిస్తానని తపనతో కష్టపడ్డానని అన్నాడు.  నిరుపేద విద్యార్థులకు  ఎప్పుడూ తోడుంటానని  
చెప్పాడు.