బిట్​ బ్యాంక్​ : భూస్వరూపాలు.. వాటి విశేషాలు

  • ప్రపంచంలో  పెద్ద  ఆర్చిపెలాగో ఇండనేషియా.
  • ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా.
  • జోగ్​ జలపాతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
  • నీలగిరి కొండలు పరిశిష్ట పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ.
  • పర్వతాల ఏర్పాటుకు సంబంధించిన రేడియో యాక్టివ్​ సిద్ధాంతాన్ని కొబర్ ప్రతిపాదించారు.
  • నాగరికత ఊయలలుగా మైదాన ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి.
  • భూసంధి అంటే రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం.
  • ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీస్​లాండ్​.
  • ఒక విశాలమైన సమతలం లేక ముఖ్యంగా సమతల ఉద్గమన ప్రదేశాన్ని పీఠభూమి అంటారు. 
  • సరస్సులను పూడ్చడం వల్ల ఏర్పడే మైదానాలను కరస్ట్​​ మైదానాలు అంటారు.
  • ఏదైనా భూభాగాన్ని జలభాగం అన్ని వైపులా ఆవరించి ఉన్నప్పుడు దానిని ద్వీపం అంటారు.
  • దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలు పరిపూర్ణమైన జిగ్​సా పూరకాలుగా కనిపిస్తాయి. 
  • వ్యవసాయానికి అత్యంత అనువైనవి మైదానాలు.
  • కొండలతో పర్వతాలు ఎత్తు విషయంలో విభేదిస్తాయి.
  • హిమనీ నదాలు (గ్లేసియర్స్​) పర్వతాల్లో ఉంటాయి.
  • యాంగ్జీ నది చైనాలో ప్రవహిస్తోంది.
  • ఐరోపాలోని ముఖ్యమైన పర్వతశ్రేణి ఆల్ఫ్స్.​
  • 600 మీటర్లకుపైగా ఎత్తు కలిగిన ఒక నిట్రమైన కొండను పర్వతం అని పిలుస్తారు.
  • భూ ఉపరితలం కోతకు గురికావడాన్ని క్రమక్షయం అంటారు.
  • క్రమక్షయ ప్రక్రియ తగ్గిపోయిన ఉపరితలం నిక్షేపణ ప్రక్రియ ద్వారా మళ్లీ నిర్మితమవుతుంది.
  • శాశ్వతంగా గడ్డకట్టుకుపోయిన మంచు నదులను గ్లేసియర్స్​ అంటారు.
  • పసిఫిక్ మహా సముద్రంలో ఉండే మౌనా కీ అనే సముద్రం లోపలి పర్వతం ఎత్తు 10,205 మీటర్లు.
  • ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థల్లో ఒకటి ఆరావళి.
  • గుండ్రంగా ఉండి, తక్కువ ఎత్తు  కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత
  • శ్రేణి అయిన ముడత పర్వతాలు అపలేచియాన్స్​ పర్వతశ్రేణి, ఉరల్​ పర్వత శ్రేణి.
  • ఖండ పర్వతాల్లో పైకి పొడుచుకు వచ్చిన ఖండాలను హార్ స్ట్స్​ (భ్రంశోత్థిత) అంటారు.
  • ఖండ పర్వతాల దిగువ ఖండాలను గ్రాబెన్​ అంటారు.
  • ఖండ పర్వతానికి ఉదాహరణ అయిన రైన్​ వ్యాలీ  జర్మనీలో ఉంది.
  • ఖండ పర్వతానికి ఉదాహరణ అయిన వాస్గెస్​ పర్వతం ఫ్రాన్స్​లో ఉంది.
  • అగ్ని పర్వతానికి ఉదాహరణ అయిన మౌంట్​ కిలిమంజారో టాంజానియాలో ఉంది.
  • అగ్ని పర్వతానికి ఉదాహరణ అయిన మౌంట్​ ఫుజియామా జపాన్​లో ఉంది.
  • పరిసర ప్రాంతాలకు ఎగువన ఉండి, పైన చదునైన భూమిని కలిగిన ప్రాంతాన్ని పీఠభూమి అని పిలుస్తారు.
  • ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పీఠభూమి టిబెట్​ పీఠభూమి.
  • బంగారం, వజ్రాల మైనింగ్​కు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఆఫ్రికన్ పీఠభూమి.
  • సువర్ణరేఖ నదిపై ఉన్న హుండ్రు జలపాతం  చోటానాగపూర్​ పీఠభూమిలో ఉంది.
  • శరావాతి నదిపై ఉన్న జోగ్​ జలపాతం భారతదేశంలోని కర్ణాటక పీఠభూమిలో ఉంది.
  • మైదానాలు సాధారణంగా సముద్ర మట్టం కంటే 200 మీటర్ల కంటే ఎత్తులో ఉండవు. 
  • మైదానాల్లో ఎక్కువ జనాభా ఉండటానికి అనువైన కారణం టెర్రాస్​ సాగుకు అనువుగా ఉండటం.
  • అవిచ్ఛిన్నమైన చదునైన లేదా అల్ప మట్టమైన నేల మైదానం.
  • హిమాలయాలు, ఆల్ఫ్స్​ పర్వతాలు ముడత పర్వతాలకు ఉదాహరణ.
  • ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండేది పీఠభూమి.
  •  అత్యంత ఎత్తయిన టిబెట్​ పీఠభూమి సముద్ర మట్టానికి 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి.