అంటార్కిటికా ఖండంపై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా అంటార్కిటికా ఖండంలో మంచు వేగంగా కరిగిపోతున్నది. ఫలితంగా ఈ ఖండం బరువు తగ్గుతున్నదని, క్రమంగా అంటార్కిటికా సముద్ర మట్టానికి పైకి వెళ్తున్నదని అమెరికాలోని మసాచుసెట్స్​ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు.

ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం వేగంగా పెరిగే ముప్పు ఉందని చెప్పారు. భూతాపం తక్కువగా ఉంటే 2500 నాటికి సముద్రమట్టం 1.7 మీటర్ల మేరకు పెరుగుతుందని, భూతాపం 
ఎక్కువగా ఉంటే 19.5 మీటర్ల వరకు కూడా పెరగొచ్చని, సముద్రంలోకి ఎక్కువగా నీరు చేరడం వల్ల ఈ ముప్పు పెరుగుతున్నట్లు తెలిపారు.