న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు యమునా నదిలో నిమజ్జనం చేశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో మన్మోహన్ సింగ్ ఈ నెల 26న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం నిగంబోధ్ ఘాట్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా.. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు అస్థికలను సేకరించారు. వాటిని అష్ట్ ఘాట్‌కు తరలించి.. సిక్కుల సంప్రదాయాల ప్రకారం మజ్ను కా తిలా గురుద్వారా సమీపంలోని యమునా నదిలో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, వారి ముగ్గురు కుమార్తెలు ఉపిందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్-- ఇతర బంధువులు పాల్గొన్నారు. సిక్కుల ఆచారాలలో భాగంగా జనవరి 1న మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మన్మోహన్ సింగ్అధికారిక నివాసంలో అఖండ పథ్నిర్వహించనున్నారు. అలాగే, జనవరి 3న పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకబ్ గంజ్ గురుద్వారాలో భోగ్, అంటిమ్ అర్దాస్, కీర్తన్ జరగనున్నాయి.