గత ఏడాది వర్షాభావ పరిస్టుల వల్ల ఇబ్బంది పడిన రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని IMD అధికారులు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో లా నినా ఎఫెక్ట్ వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య 106 శాతం మేర వర్షపాతం నమోదవుతుందని తెలిపింది వాతావరణ శాఖ.
గత ఐదేళ్ళలో వరుసగా నాలుగేళ్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది దేశవ్యాప్తంగా. అయితే, గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదవ్వటంతో చాలా చోట్ల పంటల దిగుబడి ఆశించిన రేంజ్ లో రాలేదు. అయితే, ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.