కేరళ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూరు, కాసరగోడ్ 9 జిల్లాలుక భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు జారీ చేసిన రెడ్ అలర్ట్ ను ఉపసంహరిచుకుంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లక్ష్యద్వీప్ దీవుల వైపున ఉన్న తుఫాన్.. కేరళ వైపు మళ్లిందని.. ఫలితంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్న నేపథ్యంలో రాబోయే పరిణామాలను ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేపడుతోంది. నదులు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కేరళ అంతటా నేషనల్ డిజాస్టర్ అథార్టీ (NDMA) సిబ్బంది మోహరించారు. కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని, రాత్రి వేళ ప్రయాణించవద్దని అథార్టీ కోరింది. అలల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
ఈ సందర్భంగా మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. గల్ప్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం, అండమాన్ సముద్రం, ఇతర పరిసర ప్రాంతాల్లో సుమారు గంటకు 40 నుంచి 50 కి.మీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణ ప్రారంభ తేదీ కంటే ఐదు రోజుల ముందే మే 27 నాటికి కేరళకు చేరుకుంటాయని గతంలో IMD అంచనా వేసింది.
మరిన్ని వార్తల కోసం : -
2 లక్షల మందిపై వరద ప్రభావం
జ్ఙాన్‌వాపి కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
