భారత్ కు ముంచుకొస్తున్న తౌక్టే తుపాను ముప్పు

భారత్ కు ముంచుకొస్తున్న తౌక్టే తుపాను ముప్పు

భారతదేశంలో ఇప్పటికే  కరోనా విజృంభిస్తుంటే మరోవైపు  తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మే 14 వరకు అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని.. మరికొద్ది రోజుల్లో తుపాన్‌ వచ్చే సంకేతాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. బలపడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్‌ అవుతుందన్నారు. ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్‌, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.