గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లోని పలు అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిర్మాణాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత నెల 19న రాత్రి సిద్ధిక్‌నగర్‌లో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా గుంత తీయడంతో పక్కనే ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్పక్కకు ఒరిగింది.
వెంటనే స్పందించిన శేరిలింగంపల్లి జోనల్కమిషనర్ఉపేందర్రెడ్డి ఆదేశాలతో శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేశారు. తర్వాత అలాంటి నిర్మాణాలు స్థానికంగా ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలని ఉపేందర్‌రెడ్డి టౌన్ ప్లానింగ్అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించి సీజింగ్నోటీసులు ఇస్తున్నారు. గురువారం 6 అక్రమ నిర్మాణాలను గుర్తించి సీజ్ చేసినట్లు
శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.