అమీన్పూర్ అక్రమాలపై రెవిన్యూ అధికారుల కొరడ

సంగారెడ్డి జిల్లా అమీన్​పురా మండలంలో అక్రమ నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. ఐలాపూర్ గ్రామ పరిధిలోని ఆర్​ఎస్​ నెంబరు 119లో 20 ఎకరాల భూమి కోర్డు వివాదంలో ఉంది.  అయితే కొంతమంది ఈ భూమిలో రియల్​ వెంచర్​ వేసేందుకు కార్యాచరణ రూపొందించి ప్లాట్లకు సరిహద్దు రాళ్లను వేశారు. సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సరిహద్దు రాళ్లను తీసేసి నిర్మాణాలను కూల్చేశారు.  అలాగే అమీన్​ పుర మున్సిపల్​  పరిధిలోని 462 సర్వే నంబర్ లో ప్యూజియన్ స్కూల్   ఉన్న 17 గుంటల ప్రభుత్వ భూమి...   అమీన్పూరు రోడ్డు పక్కన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి  నిర్మించిన కమర్షియల్ శేటర్స్ ప్రభుత్వ భూమిలో ఉన్నందువలన  వాటన్నిటినీ కూల్చి వేయడం జరుగుతుందన్నారు.  ఈ ఆక్రమణలపై హైడ్రాకు.. రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయని పోలీసు అధికారుల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు.