మన IIT స్టూడెంట్ అద్భుతం : సూపర్ పవర్ షూస్ వచ్చేశాయ్..!

ఇండియన్స్ తెలివి తేటలకు కొదవలేదు అనటానికి.. కొత్త కొత్త ఆవిష్కరణలతో అద్భుతాలు చేస్తుందని నిరూపించారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. IIT ఇండోర్ స్టూడెంట్స్. సూపర్ పవర్ షూస్ తయారు చేశారు. ఈ షూస్ వేసుకుంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది.. ఆ కరెంట్ ద్వారాలోనే షూలోని చిప్స్ పని చేస్తాయి.. మొదటి దశలో 10 జతల షూస్ తయారు చేసిన IIT ఇండోర్ స్టూడెంట్స్.. వాటిని మన భారత సైన్యాన్ని అందించారు. ఈ సూపర్ పవర్ షూస్ వల్ల ఉపయోగాలు ఏంటీ.. వాటిని ధరిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది తెలుసుకుందామా..

>>> షూలో మైక్రో చిప్ లు ఉంటాయి. అదే విధంగా షూలో చిన్నపాటి ఎలక్ట్రానిక్స్ ను అమర్చారు.
>>> ఈ షూ వేసుకుని నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు కరెంట్ సరఫరా జరుగుతుంది.
>>> షూలోని చిప్స్ ను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) అనుసంధానం అయ్యి ఉంటుంది. 
>>>  మనం ఎక్కడ ఉన్నాం.. ఎలాంటి ప్రాంతంలో ఉన్నాం అనేది స్పష్టంగా చెబుతుంది. అదే విధంగా నడుస్తున్నప్పుడు.. పరిగెత్తుతున్నప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది అనేది కూడా స్పష్టంగా అలర్ట్ ఇస్తుంది. 
>>> ఈ షూ ద్వారా ఆయా ప్రాంతాల్లోని వాతావరణం పరిస్థితులను కూడా అంచనా వేయొచ్చు.
>>> అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కకుంటే.. మనం ఎక్కడ ఉన్నాం అనే లొకేషన్.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది. 
>>> ఈ షూస్ సైనికులకు బాగా పనికొస్తాయి. అదే విధంగా పర్వతారోహణలు చేసే వారికి బెస్ట్.
>>> అల్జీమర్స్ తో బాధపడే సీనియర్ సిటిజన్స్, స్కూల్ పిల్లలకు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటాయి. 
>>> ఈ షూస్ వేసుకోవటం ద్వారా స్కూల్ కు వెళ్లిన పిల్లలు ఎక్కడ ఉన్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. ఏదైనా ఆపదలో ఉన్నారా అనేది మన మొబైల్ నుంచే ఆపరేట్ చేసి తెలుసుకోవచ్చు. 

IIT ఇండోర్ స్టూడెంట్స్ తయారు చేసిన సూపర్ పవర్ షూస్ ఇప్పుడు మన సైనికులు.. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఉపయోగిస్తున్నారు. వీటి పనితీరును DRDO పరిశీలిస్తుంది. అంతా బాగుంది అనుకుంటే.. రాబోయే రోజుల్లో బహిరంగ మార్కెట్లోనూ వీటిని అమ్ముతారు. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.. 

మొత్తానికి ఈ సూపర్ పవర్ షూ మాత్రం నెటిజన్లకు విపరీతంగా ఆకర్షిస్తుంది..