20 పోర్టుల డెవలప్‌మెంట్‌ కోసం రూ. 8,244 కోట్ల అప్పులు

20 పోర్టుల డెవలప్‌మెంట్‌ కోసం రూ. 8,244 కోట్ల అప్పులు

న్యూఢిల్లీ: దేశంలోని 20 పోర్టులను డెవలప్ చేసేందుకు రూ.8,244 కోట్ల అప్పులను ఇచ్చామని  ప్రభుత్వ సంస్థ ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌) పేర్కొంది.  ఈ పోర్టుల కెపాసిటీ  ఏడాదికి 83.60 కోట్ల టన్నులు  పెంచేందుకు ఈ లోన్లను మంజూరు చేశామని వివరించింది.  ప్రస్తుతం దేశంలోని  మొత్తం పోర్టుల కెపాసిటీ ఏడాదికి 260 కోట్ల టన్నులుగా ఉంది.   ఇందులో 12 పోర్టుల కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీనే ఏడాదికి 159.80 కోట్లుగా ఉంది. ఐఐఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ లోన్లు మంజూరు చేసిన పోర్టులలో పారాదీప్‌‌‌‌ పోర్ట్‌‌‌‌, ఎస్సార్ వైజాగ్ పోర్ట్, ట్యుటికోరిన్, కృష్ణపట్నం, కరైకల్ పోర్టులు కూడా ఉన్నాయి. ‘తాజాగా రామయపట్నం పోర్ట్‌‌‌‌కు కూడా ఫైనాన్స్​​ చేస్తున్నాం. పోర్టులు చాలా ముఖ్యమైన సెక్టార్‌‌‌‌‌‌‌‌. లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి, కనెక్టివిటీని పెంచి దేశ ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది’ అని ఐఐఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఎండీ పీఆర్ జైశంకర్ అన్నారు. 

రామాయపట్నం, భావనపాడుతో కలిపి నిర్మాణం జరగనున్న పోర్టులలో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. మరో రెండు మూడేళ్లలో వీటి కెపాసిటీ ఏడాదికి 100 కోట్ల టన్నులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. రామయపట్నం (ఆంధ్ర) పోర్టు వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభం కానుంది. ‘ఐఐఎఫ్‌‌‌‌సీఎల్ ఇప్పటి వరకు ఆర్థికంగా రూ. 8,244 కోట్లను సాయం చేసింది. ఇందులో రూ.787 కోట్లను  5 మేజర్ పోర్టులలో టెర్మినల్స్‌‌‌‌ను డెవలప్ చేయడానికి, రూ.7,465 కోట్లను 15 చిన్న పోర్ట్ ప్రాజెక్ట్‌‌‌‌లను డెవలప్‌‌‌‌ చేయడానికి ఇచ్చాం. వీటిలో చాలా పోర్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మూడు చిన్న పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి’ అని జైశంకర్ వివరించారు. దేశంలోని ఐదు మేజర్ పోర్టులు, 15 చిన్న పోర్టుల డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఐఐఎఫ్‌‌‌‌సీఎల్ భాగస్వామ్యం అయ్యిందని పేర్కొన్నారు.