రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలి

  • మల్టీ జోన్​-2 ఐజీ సత్యనారాయణ

పాలమూరు, వెలుగు: డిపార్ట్​మెంట్​కు చెందిన ఇంపార్టెంట్​ రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలని మల్టీ జోన్–-2 ఐజీ సత్యనారాయణ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం జోగులాంబ జోన్–​-7 డీఐజీ ఆఫీసులో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోన్‌‌‌‌లోని ఐదు జిల్లాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ2024లో ఈ జోన్​లో 16,833 కేసులు నమోదు కాగా, వీటిలో 3,784 కేసులు ఇన్వెస్టిగేషన్​లో ఉన్నాయన్నారు.

మహబూబ్​నగర్ జిల్లాలో అత్యధికంగా 5,896 కేసులు నమోదు కాగా.. నాగర్​కర్నూలులో 3,770, వనపర్తిలో 3,538, గద్వాలలో 2,419, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 2,210 కేసులు నమోదయాయన్నారు. మర్డర్​ కేసులు 84, అటెంప్ట్  మర్డర్స్ 78,  చోరీలు 1,608 జరుగగా ప్రాపర్టీ లాస్ రూ.11.10 కోట్లు జరిగిందన్నారు. ఇందులో రూ.3,42,37,750 రికవరీ చేసినట్లు వివరించారు. 202 కిడ్నాప్​లు, 315 అత్యాచారాలు, 779 చీటింగ్ కేసులు, 1,559 యాక్సిడెంట్లు నమోదైనట్లు తెలిపారు. ఆయన వెంట డీఐజీ ఎల్ఎస్  చౌహాన్, పాలమూరు ఎస్పీ  డి.జానకి ఉన్నారు. 

జోగులాంబను దర్శించుకున్న ఐజీ

అలంపూర్: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని ఐజీ సత్యనారాయణ, డీఐజీ చౌహాన్  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా గణపతి, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రాలతో సత్కరించి, వేద ఆశీర్వచనాలను 
అందజేశారు.