ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో జాబ్ కొడితే నక్కతోక తొక్కినట్టే! ఎందుకంటే ఇందులో చేరిన టెకీలకు కంపెనీ బీఎండబ్ల్యూ, కేటీఎం వంటి లగ్జరీ బైకులను ఇస్తోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోపు కత్తిలాంటి టెకీ టీమ్‌ను డెవెలప్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత్‌పే తెలిపింది. కొత్తగా వంద మందికి జాబ్స్ ఇస్తామని తెలిపింది. బైక్స్ వద్దనుకుంటే ఆపిల్ ఐపాడ్, బోస్ హెడ్‌ఫోన్, హర్మన్ కార్డర్ స్పీకర్, శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్, ఫైర్‌ఫాక్స్ బైసైకిల్ వంటివి తీసుకోవచ్చు. ట్యాలెంటెడ్ క్యాండిడేట్లను ఆకర్షించడానికే వీటిని ఇస్తున్నామని భారత్ పే కో–ఫౌండర్, సీఈఓ ఆశినిర్ గ్రోవర్ చెప్పారు.
