న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో అడ్రస్ మారిస్తే చాలు బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డ్, గ్యాస్ కనెక్షన్, టెలికాం ఆపరేటర్ల వద్ద కూడా ఆటోమెటిక్‌గా అడ్రస్ మారిపోయే సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. వ్యక్తి ఆధార్‌తో లింక్ అయి ఉన్న అన్ని ర కాల డేటా బేస్‌లలో అడ్రస్ చేంజ్ అయ్యేలా బ్యాక్‌ఎండ్‌లో డేటా ఇంటిగ్రేషన్‌ను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటి వరకు 127 కోట్ల ఆధార్ నెంబర్లను ప్రభుత్వం ఇష్యూ చేసింది.
ఈ కొత్త సిస్టమ్ వలన ఆధార్ కార్డులో అడ్రస్‌ను మార్చుకుంటే, మిగిలిన డేటా బేస్‌లలో కూడా ఆటోమెటిక్‌గా మార్చుకోవడానికి వ్యక్తులకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ వచ్చే కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ సర్వీస్ వలన నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్‌లో పట్టే టైమ్, రీసోర్స్‌లు కంపెనీలకు మిగులుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
for more News..
ఒలింపిక్ మెడలే టార్గెట్ అంటున్న సింధు
రాసిపెట్టుకో.. రేపు నీదే గెలుపు!
