కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి చక్కబడదు: ఢిల్లీ మంత్రి అతిషీ 

కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి చక్కబడదు: ఢిల్లీ మంత్రి అతిషీ 

ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతుంది. త్రాగడానికి, కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకొకటి చెప్పున కాలనీ కి వచ్చే ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం ఎగబడుతున్నారు ప్రజలు. ఢిల్లీలో నీటి కష్టాలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రికత  పరిస్థితులకు దారి తీశాయి. చాతర్ పుర్ లోని  జల్ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు ఆందోళన కారులు. కుండలు, రాళ్లతో  ఆఫీసు అద్దాలను పగులగొట్టారు. దీంతో ధర్నా చేస్తున్న వారిని అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు.

ఢిల్లీలో  నీటి కొరత నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మెరుగుపడదని .. హర్యానిలోని బీజేపీ ప్రభుత్వంలో మాట్లాడి ఢిల్లీకి ఎక్కువ నీళ్లు ఇప్పించాలని మంత్రి అతిషీ అన్నారు.  ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటి వనరులను కాపాడుకోడానికి ఢిల్లీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు. ప్రధాన పైప్ లైన్ ల దగ్గర పెట్రోలింగ్, రక్షణ పెంచాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు ఢిల్లీ మంత్రి అతిషీ. నీటి కొరతతో పైప్ లైన్ ల నుంచి కొంతమంది నీటిని దొంగలిస్తున్నారని చెప్పారు. పైపులను కత్తిరించడం వలన లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు అతిషీ.

ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై దాడి జరగడంపై స్పందించారు బీజేపీ నేత రమేశ్ బిధూరి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్నారు.  ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కానీ ప్రజలు కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. ఆందోళన కారులు దాడులు చేయకుండా  బీజేపీ కార్యకర్తలు  కంట్రోల్ చేయడంతోనే  పరిస్థితి సద్దుమణిగిందన్నారు.