ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తన కస్టమర్లకు ఓ నూతన ఫండ్ ఆఫర్ ను ప్రకటించనుంది. ఈ ఫండ్… ఫ్లోటింగ్ రేట్ డెబ్ట్, ఫ్లోటింగ్ రేట్ రిటర్న్స్ మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం స్వాప్ చేయబడిన ఫిక్స్డ్ రేట్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడిన పోర్ట్‌ఫోలియో ద్వారా స్థిరమైన రాబడులను సృష్టించనుంది. ఈ ఫండ్ తమ కార్పస్‌లో.. కార్పోరేట్లు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫ్లోటింగ్ రేట్ సెక్యూరిటీలు లేదా స్థిరమైన వడ్డీ అందించే సెక్యూరిటీలను డెరివేటివ్స్ ద్వారా ఫ్లోటింగ్‌గా మార్చడం లక్ష్యంగా చేసుకుని 65% వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఫిబ్రవరి 10,2021వ తేదీ నుంచి ఫిబ్రవరి 16,2021వ తేదీ వరకు ఉండనున్నట్లు ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సీఈవో విశాల్ కపూర్ తెలిపారు.
