కులమతాలకు అతీతంగా ప్రతీ వ్యక్తికి సమాన అవకాశాలిచ్చి… వారి కళలను సాకారం చేయడమే లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 70ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామన్నారు. 70శాతానికి పైగా ఉన్న ముస్లిం బాలికల స్కూల్ డ్రాప్ అవుట్స్ ని 30 శాతానికి తగ్గించామన్నారు. 70ఏళ్లుగా సరైన సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బంది పడ్డారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము గ్రామాల్లో, స్కూళ్లలో టాయిలెట్లు కట్టించామన్నారు.
యూపీలోని అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రధాని. ఈసందర్భంగా పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేశారు. అలీగడ్ యూనివర్సిటీ దేశానికే బలమన్నారు ప్రధాని. ప్రపంచ పర్యటనకు వెళ్లినపుడు విదేశీ విద్యార్థులు మన యూనివర్సిటిలో చదివామని చెప్పడం గర్వంగా ఉంటుందన్నారు. కరోనా నియంత్రణలోనూ AMU సహకారం మరిచిపోలేదన్నారు మోడీ.
People tell me that the AMU campus is like a city in itself. We see a Mini India among different departments, dozens of hostels, thousands of teachers & professors. The diversity which we see here is not only the strength of this university but also of the entire nation: PM Modi https://t.co/HALhsFsrvB pic.twitter.com/6QWH6xqO0U
— ANI (@ANI) December 22, 2020
