Bank Jobs: 600 బ్యాంకు కొలువులు.. ఏడాదికి రూ.6.50 లక్షల వరకు జీతం

బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత హోదాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త అందుతోంది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐడీబీఐ 600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్(JAM), అగ్రి అసెట్ ఆఫీసర్స్ (AAO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగాలు: 600

విభాగాల వారీగా ఖాళీలు: 

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం): 500
  • అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్: 100

ఖాళీలు గల జోన్లు:

  • ముంబై- 125
  • అహ్మదాబాద్- 70
  • బెంగళూరు- 65
  • చండీగర్- 50   
  • చెన్నై- 50
  • కొచ్చి - 30
  • నాగ్‌పుర్- 50
  • పూణే- 60

అర్హతలు: 

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. 
  • అగ్రి అసెట్ ఆఫీసర్స్(ఏఏఓ) పోస్టులకు బీఎస్ సీ/ బీటెక్‌/ బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్‌ సైన్స్/ ఇంజినీరింగ్, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/ టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. 
  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు.. ఎస్‌సి/ ఎస్‌టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
  • కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాలపై పరిజ్ఞానం తప్పినసరి.

వయోపరిమితి: 01/ 10/ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు కలదు. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక  ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు: ఎస్‌సి/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250.. ఇతరులు రూ.1050 చెల్లించాలి.

జీతభత్యాలు: గ్రేడ్ 'O' కింద ఏడాదికి రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/ 11/ 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ: 30/ 11/ 2024

నోటిఫికేషన్ కోసం IDBI JAM & AAO Recruitment 2024 క్లిక్ చేయండి.

 

ALSO READ | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?​