పెరిగిన నాలుగు బ్యాంకుల లాభం

పెరిగిన నాలుగు బ్యాంకుల లాభం

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకులు  ఐసీఐసీఐ, కోటక్‌‌ బ్యాంక్‌‌లు ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో అదరగొట్టాయి. మరోవైపు యెస్ బ్యాంక్ నిరాశ పరచగా, ఆర్‌‌‌‌బీఎల్‌‌ బ్యాంక్, ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌లు   అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్: రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎనలిస్టుల అంచనాలను అందుకుంది. బ్యాంక్‌‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ (క్యూ2) లో రూ. 7,558 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 5,511 కోట్లతో పోలిస్తే ఇది 37 శాతం ఎక్కువ. బ్యాంక్ వడ్డీ ఆదాయం 26 శాతం పెరిగి రూ.11,690 కోట్ల నుంచి రూ. 14,787 కోట్లకు చేరుకుంది. క్యూ2 లో బ్యాంక్ డిపాజిట్లు 12 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ.10.90 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ మొండిబాకీలు (ఎన్‌‌పీఏలు) క్యూ2 లో తగ్గాయి.కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏ రేషియో 4.82 శాతంగా ఉండగా, క్యూ2 లో ఇది 3.19 శాతానికి మెరుగుపడింది. నెట్‌‌ ఎన్‌‌పీఏ రేషియో 0.99 శాతం నుంచి 0.61 శాతానికి తగ్గింది. బ్యాంక్ ప్రొవిజన్లు ఏడాది ప్రాతిపదికన 39 శాతం తగ్గి రూ.2,714 కోట్ల నుంచి రూ.1,644 కోట్లకు దిగొచ్చాయి. 

కోటక్‌‌ బ్యాంక్‌‌: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రాఫిట్‌‌ క్యూ2 లో రూ. 3,608.18 కోట్లకు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 2,899.74 కోట్లతో పోలిస్తే ఈసారి బ్యాంక్ లాభం 21 శాతం ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పెరిగి రూ. 5,353 కోట్ల నుంచి రూ.6,620 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 3.19 శాతం నుంచి 2.08 శాతానికి మెరుగుపడింది. నికర ఎన్‌‌పీఏల రేషియో 1.06 శాతం నుంచి 0.55 శాతానికి దిగొచ్చింది. బ్యాంక్ బ్యాడ్ లోన్ల కోసం క్యూ2 లో రూ.136.5 కోట్లను ప్రొవిజినింగ్ చేసింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.435.25 కోట్లను ప్రొవిజినింగ్ చేశారు.

ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌‌ బ్యాంక్‌‌: ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌ నికర లాభం క్యూ2 లో  ఏకంగా 266 శాతం ఎగిసింది. బ్యాంక్‌‌కు కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.152 కోట్ల నికర లాభం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 556 కోట్లు వచ్చింది. వడ్డీ ఆదాయం రూ. 2,930 కోట్ల నుంచి రూ.3,947 కోట్లకు పెరిగింది.

ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌: ఆర్‌‌‌‌బీఎల్‌‌ బ్యాంక్ నికర లాభం క్యూ2 లో ఏడాది ప్రాతిపదికన రూ. 31 కోట్ల నుంచి రూ.202 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 2,567.65  కోట్ల నుంచి రూ.2,758.98 కోట్లకు  చేరుకుంది. నెట్‌‌ ఎన్‌‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 2.14 శాతం నుంచి 1.26 శాతానికి మెరుగుపడింది.

యెస్ బ్యాంక్‌‌: యెస్ బ్యాంక్‌‌కు కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.225.5 కోట్ల నికర లాభం రాగా, క్యూ2 లో 32 శాతం తగ్గి రూ.152.82 కోట్లకు పడిపోయింది. బ్యాంక్‌‌కు క్యూ2 లో రూ.1,991 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో ఇది రూ.1,512 కోట్లుగా రికార్డయ్యింది. నెట్‌‌ ఎన్‌‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 5.56 శాతం నుంచి 3.6 శాతానికి మెరుగుపడింది.