హైదరాబాద్, వెలుగు: రిఫ్రిజిరేషన్ ప్రొడక్టులు తయారు చేసే ఐస్మేక్ 2023 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. పూర్తి సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షికంగా184 శాతం పెరిగి రూ. 20.80 కోట్లకు చేరుకుంది. ఇది మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.7.32 కోట్లుగా ఉంది. రాబడి 52 శాతం పెరిగి 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 313.32 కోట్లకు చేరుకుంది.
ఇది అంతకు ముందు సంవత్సరంలో రూ. 206.80 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 56.02శాతం పెరిగి రూ. 8.63 కోట్లకు చేరుకుంది. 2022 నాలుగో క్వార్టర్లో ఇది రూ. 5.53 కోట్లుగా ఉంది. ఇదే క్వార్టర్లో ఆదాయం 48 శాతం పెరిగి రూ. 114.28 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ వార్షికంగా రూ.4.65 నుంచి రూ.13.19లకు పెరిగిందని ఐస్మేక్
తెలిపింది.
