Women's T20 World Cup 2024: న్యూజిలాండ్‌తో భారత్ తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి యూఏఈలో జరిగే మెగా పోరులో టైటిలే లక్ష్యంగా ప్రతి జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యాయి. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు తలపడబోతున్నాయి. ఈ మెగా టోర్నీ 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. సెమీస్‌ ఫైనళ్లు, ఫైనల్‌ సహా మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు తొలి మ్యాచ్ లో  పాకిస్థాన్ తో శ్రీలంక తలపడుతుంది. భారత్ విషయానికి వస్తే రేపు న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. 

ALSO READ | IND vs BAN 2nd Test: ఇదెక్కడి ట్విస్ట్.. రోహిత్, కోహ్లీలకు బంగ్లాదేశ్ క్రికెటర్ బ్యాట్ గిఫ్ట్

భారత్ ఉన్న గ్రూప్ లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఉంటున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కఠిన ప్రత్యర్ధులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెమీస్ కు వెళ్లాలంటే టాప్ 2 లో నిలవాల్సిందే. ఇందులో భాగంగా ఆడే నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. అక్టోబర్ 6 న దాయాధి పాకిస్థాన్ తో తలపడుతుంది. 9న శ్రీలంక.. చివరి మ్యాచ్ 13 న ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. ఈ సారి స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్ ఫైనల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.   

లైవ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..? 

మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు మన దేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్ గా డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు.
 
 టీ20 వరల్డ్ కప్ లో భారత్ ప్రదర్శన :

2009లో మొదలైన ఈ టోర్నీలో ఇండియా ఎనిమిదిసార్లు బరిలోకి దిగింది. కానీ ఒక్కసారి కూడా కప్‌‌‌‌ కొట్టలేదు. 2020లో ఫైనల్‌‌‌‌కు చేరినా ఆసీస్‌‌‌‌ చేతిలో ఓడింది. లీగ్‌‌‌‌ మొత్తం అద్భుతంగా ఆడిన టీమిండియా టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో ఓడిన తీరు ఫ్యాన్స్‌‌‌‌ను ఆగ్రహానికి గురి చేసింది. 2009, 2010లో సెమీస్‌‌‌‌కు చేరిన ఇండియా 2012, 2014, 2016లో తొలి రౌండ్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టింది. 2018, 2023లో సెమీస్‌‌‌‌లో నిరాశపర్చింది.  

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత,  షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్, ఆశా శోభన, ఎస్. సజన, శ్రేయాంక పాటిల్.