ఐసీసీ టీ20 ర్యాంక్లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ @ 8

దుబాయ్‌ ‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌.. ఐసీసీ టీ20 ర్యాంక్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (642) ఎనిమిదో ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీయడం ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఇండియా నుంచి టాప్‌‌‌‌–10లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ మాత్రమే ఉన్నాడు. 

వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ 35వ ర్యాంక్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. ఆదిల్‌‌‌‌ రషీద్‌‌‌‌ (721), అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (695), రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (668) టాప్‌‌‌‌–3లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ పాండ్యా 60వ ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. సూర్యకుమార్‌‌‌‌ (807), యశస్వి జైస్వాల్‌‌‌‌ (749), రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (657) వరుసగా రెండు, ఐదు, తొమ్మిదో ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు.