చెన్నై వేదికగా బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క టెస్ట్ మ్యాచ్ తో టీమిండియా ఆటగాళ్ల బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు వచ్చాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏడో ర్యాంక్ నుంచి 12 ర్యాంక్ కు పడిపోయాడు. చెన్నై టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 709 రేటింగ్ పాయింట్లతో 12 వ స్థానానికి పడిపోయాడు.
ALSO READ | Irani Cup 2024: ముంబై స్క్వాడ్ వచ్చేసింది.. స్టార్ ప్లేయర్లతో పటిష్టంగా రహానే సేన
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఐదు స్థానాలు దిగజారి 10 ర్యాంక్ కు పడిపోయాడు. బంగ్లాతో సిరీస్ కు ముందు వరకు రోహిత్ 5 ర్యాంక్ లో ఉన్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 6.. రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో 716 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో వైపు కార్ ఆక్సిడెంట్ నుంచి దాదాపు 20 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన పంత్ టాప్ 10 లో చేరడం విశేషం.
చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 39.. రెండో ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేసిన పంత్.. 731 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో చోటు సంపాదించాడు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 5 వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాతో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో సత్తా చాటిన గిల్.. 14 స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆసీస్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Here is a look at Latest ICC Men's Test Rankings of India players
— SportsTiger (@The_SportsTiger) September 25, 2024
?: BCCI#YashasviJaiswal #ViratKohli? #rohitsharma #shubmangill pic.twitter.com/qTjGFDG75n