Champions Trophy 2025: భారత్‌కు ఐసీసీ బిగ్ షాక్.. సరైన కారణం చేబితేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత

వచ్చే ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల తరువాత దాయాది దేశం ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పొరుగు దేశానికి వెళ్తుందా..! లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. భారత ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే భారత జట్టు.. పాక్‌లో పర్యటిస్తుంది, లేదంటే లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అది దాదాపు అసంభవమే. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ కు  భారత్ వెళ్లడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఒక డిమాండ్ తో ఐసీసీ వద్దకు వెళ్ళింది. 

పాకిస్తాన్ ఔట్‌లెట్ జియో న్యూస్ నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి ఎందుకు నిరాకరించారో భారత్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఐసీసీ.. బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. బీసీసీఐ లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరిందట. బీసీసీఐ సరైన కారణాలను అందించడంలో విఫలమైతే.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందిగా భారత్‌ను కోరుతుందట. ఒకవేళ ఈ మెగా టోర్నమెంట్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తే.. ఐసీసీ భారత్ స్థానంలో మరొక జట్టును తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

Also Read :- ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుర్రాళ్ళ ధాటికి విల విల

బీసీసీఐ పాకిస్తాన్‌కు టీమిండియాను పంపకపోతే.. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకు భారత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇప్పటికే పాక్ మీడియా సంస్థలు  చెప్పుకొచ్చాయి. భారత్ ఒప్పుకోకపోతే ఆ స్థానాన్ని ఐసీసీ శ్రీలంకతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయట.2008లో చివరి సారిగా పాకిస్తాన్ దేశంలో టీమిండియా ఆసియా కప్ లో పాల్గొన్నది. ఆ తర్వాత నుంచి అంటే.. ఈ 14 ఏళ్లల్లో ఎప్పుడూ పాక్ వెళ్లలేదు టీమిండియా. తటస్త వేదికపై మాత్రం పాకిస్తాన్ తో తలపడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది.