హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌లోనే చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ

దుబాయ్‌‌‌‌ : వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ ఆతిథ్యంపై ఎట్టకేలకు అనిశ్చితి వీడింది. బీసీసీఐ కోరినట్లుగానే హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌లో టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీంతో పాకిస్తాన్‌‌‌‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌‌‌‌లను తటస్థ వేదికల్లో నిర్వహించనున్నారు. అదే టైమ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌కూ కాస్త ఉపశమనాన్ని కలిగించారు. 2024 నుంచి 2027 వరకు ఐసీసీ ఈవెంట్లలో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ మధ్య జరిగే అన్ని మ్యాచ్‌‌‌‌లను కూడా తటస్థ వేదికల్లోనే నిర్వహిస్తారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2028 విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు కూడా ఈ రూల్ వర్తించనుంది. 2025 విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ఇండియా, 2026  మెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ఇండియా, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ రెండు టోర్నీల కోసం పాక్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇండియాలో పర్యటించదు. తటస్థ వేదికల్లో మాత్రమే మ్యాచ్‌‌‌‌లు ఆడుతుంది. ఇక చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత తొలగిపోవడంతో షెడ్యూల్‌‌‌‌ను ఖరారు చేసేందుకు ఐసీసీ రెడీ అవుతోంది.