యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ -2021 పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన టాప్ 20 అభ్యర్థులను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ఢిల్లీలో సత్కరించారు. వారితో కాసేపు ముచ్చటించిన మంత్రి .. పరీక్షలో విజయం సాధించినందుకు వారిని అభినందించారు. అయితే ఈ పరీక్షల్లో మెదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన శ్రుతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా ఈ కార్యక్రమంలో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. అంతేకాకుండా వారు మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఫోటో దిగారు. డిల్లీకి చెందిన శ్రుతి శర్మ సివిల్స్‌లో నంబర్ 1 ర్యాంకు సాధించగా, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా రెండు, మూడు ర్యాంకులను సాధించారు. తొలి 25మంది టాపర్లలో 15మంది పురుషులు కాగా,10మంది మహిళలు ఉన్నట్టుగా యూపీఎస్సీ వెల్లడించింది.
