న్యూఢిల్లీ: ‘ఒక అథ్లెట్‌గా నేను ఇండియాకు ఆడేందుకు ఇక్కడకు వచ్చా. నాకు హిందూ–- ముస్లిం ముఖ్యం కాదు. నేను ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించను, నా దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ స్పష్టం చేసింది. తాను సాధించిన విజయాల కంటే తన మతపరమైన నేపథ్యంపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరగడంపై నిఖత్ పైవిధంగా స్పందించింది. దేశం తరఫున పతకాలు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇక, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో ఒత్తిడిని జయించడానికి అవసరమైన శిక్షణ ఇస్తే బాగుంటుందని తెలంగాణ బాక్సర్ అభిప్రాయపడింది.
