మిగ్  21 ఎయిర్ క్రాఫ్ట్​ల సేవలు  తాత్కాలికంగా బంద్

మిగ్  21 ఎయిర్ క్రాఫ్ట్​ల సేవలు  తాత్కాలికంగా బంద్

న్యూఢిల్లీ : ఇండియన్  ఎయిర్ ఫోర్స్  (ఐఏఎఫ్) 50 మిగ్  21 ఫైటర్​ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 50 మిగ్​ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈనెల 8న రాజస్థాన్ లోని హనుమాన్​గఢ్​​లో ఓ మిగ్​ విమానం కూలిపోయి ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ యుద్ధ విమానాల పనితీరుపై మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఈ నేప థ్యంలో అన్ని మిగ్  యుద్ధ విమానాలను ఐఏఎఫ్​ టెక్నికల్  తనిఖీల కోసం పంపింద ని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘‘ప్రస్తు తం ఆ విమానాలన్నింటికీ టెక్నికల్  పరీక్ష లు నిర్వహిస్తున్నారు. విధుల నిర్వహణకు ఫిట్  అని తేలిన తర్వాత సంబంధిత నిపు ణుల టీం క్లియరెన్స్  ఇచ్చాకే వాటిని అను మతిస్తం” అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 1960లో మిగ్  యుద్ధ విమానాలను ఐఏఎఫ్​లో ఇండక్ట్  చేశారు. మొదటిసా రిగా మిగ్  ఫైటర్​ను చేర్చాక ఐఏఎఫ్​ 870 మిగ్  21 ఫైటర్లను తయారు చేసింది. అయితే, ఈ విమానాల పనితీరు నాసిర కంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.