పంట పొలాల్లో దిగిన  అపాచీ హెలికాప్టర్

పంట పొలాల్లో దిగిన  అపాచీ హెలికాప్టర్

బింద్/న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్​ఫోర్స్​కు చెందిన అపాచీ హెలికాప్టర్​ సోమవారం మధ్యప్రదేశ్​లోని బింద్​లో ఎమర్జెన్సీ ల్యాండ్​ అయింది. హెలికాప్టర్​లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్​ ముందు జాగ్రత్తగా పంటపొలాల్లో ల్యాండ్​ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐఏఎఫ్​ అధికారి తెలిపారు. ‘అపాచీ ఎహెచ్​ 64 హెలికాప్టర్​ ఎంపీలోని బింద్​లో ల్యాండ్​ అయింది. రొటీన్​ ఆపరేషనల్​ ట్రైనింగ్​లో పైలట్ హెలికాప్టర్​లో స్వల్ప సమస్యలను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండ్​ చేశాడు. హెలికాప్టర్​లోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. సంఘటన స్థలానికి రెస్క్యూ టీమ్​ను పంపించాం’ అని ఐఏఎఫ్​ ట్వీట్​చేసింది.