భూ బాధితులకు న్యాయం చేస్తం: కీసర ఆర్డీవో సైదులు

ఘట్కేసర్, వెలుగు: ఘట్​కేసర్ రైల్వే వంతెన భూ బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని కీసర ఆర్డీవో సైదులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవో ఆఫీస్​లో రైల్వే వంతెన భూబాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. 11 ఏండ్లుగా నిలిచిపోయిన రైల్వేవంతెన నిర్మాణ పనులకు సహకరించాలని కోరారు. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని గతంలోనే కోర్టులో డిపాజిట్ చేశామని, వాటిని తీసుకొని సహకరించాలన్నారు.

పరిహారం సరిపోకుంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఎ)ను సంప్రదించాలని కోరారు. అపోహాలు నమ్మకూడదని, స్వచ్ఛందంగా వంతె న నిర్మాణం కోసం చేపడుతున్న కూల్చివేతలకు సహకరించాలన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్​రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్ పావనిజంగయ్య యాదవ్, బీబ్లాక్ అధ్యక్ష్యుడు వేముల మహేశ్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.