అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరాను : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధి కోసమే  కాంగ్రెస్ లో చేరానని  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  తెలిపారు.    మంగళవారం ఆయన గట్టు మండలంలో   మాట్లాడారు. కల్యాణ  లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొని 197 మంది మహిళలకు చెక్కులు అందించారు.  అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.  

అనంతరం ఆయన మాట్లాడారు.   సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ కు రిపేర్లు, గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసుకునేందుకు చర్యలు  తీసుకుంటామన్నారు.