వ్యాక్సిన్ విషయంలో పుకార్లు నమ్మొద్దు

వ్యాక్సిన్ విషయంలో పుకార్లు నమ్మొద్దు
కరోనా వ్యాక్సిన్ విషయంలో పుకార్లని నమ్మొద్దని ప్రజలను కోరారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. వ్యాక్సిన్ సేఫ్టీ, సమర్థతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలియో వ్యాక్సిన్ టైమ్ లోనూ అనేక రూమర్లు వచ్చాయని… అయినా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు దేశం పోలియో రహితంగా మారిందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించడంతో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను గైడ్ లైన్స్ లో చేర్చామన్నారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రైరన్ జరుగుతోందన్నారు. వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప… మిగతా ప్రాసెస్ అంతా జరుగుతోందని చెప్పారు. ఢిల్లీలోని GTB హాస్పిటల్ లో వ్యాక్సిన్ డ్రైరన్ ను హర్షవర్ధన్ పరిశీలించారు. I appeal to people not to pay heed to rumours. Ensuring safety & efficacy of vaccine is our priority. Different kinds of rumours were spread during polio immunisation but people took the vaccine & India is now polio-free: Union Health Minister Harsh Vardhan on COVID-19 vaccine pic.twitter.com/Ig1fThd0Gc — ANI (@ANI) January 2, 2021