హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు!

  • టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయనున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఆటోలను   తయారు చేసేందుకు టీవీఎస్  మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  చేతులు కలపాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా చూస్తోంది.  ఈ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆటోల తయారీని టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసుకుంటుందని, డిజైన్, టెక్నాలజీని హ్యుందాయ్ చూసుకుంటుందని సంబంధిత వ్యక్తులు వివరించారు.  ఈ బండ్లను ఇండియాలోనే తయారు చేయనున్నారు.  టీవీఎస్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా పనిచేసే అవకాశం కూడా ఉంది. చిన్న బండ్లకు సంబంధించిన టెక్నాలజీని టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  హ్యుందాయ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచుకుంటుందని తెలిసింది. కాగా, ఈ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుపై హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీవీఎస్ స్పందించలేదు.

 రానున్న భారత్ మొబిలిటీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో  హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ క్రెటా మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రదర్శనకు ఉంచనుంది.  మరోవైపు టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా  ఈ ఏడాది సొంతంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.   రైడ్ పూలింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను షేర్ చేసుకోవడం) ను అందించేందుకు  తన యాప్ షక్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియాలో లాంచ్ చేయాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. ఈ యాప్  సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియాలో అందుబాటులో ఉంది.