ఈ నెల 5 న ఆటో ఎక్స్‌పో ప్రారంభం
న్యూఢిల్లీ: సరికొత్త క్రెటా మోడల్‌తోపాటు, టక్సన్ అప్ డేటెడ్ వెర్షన్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు హ్యుండయ్ మోటర్స్ ఇండియా(హెచ్‌ఎంఐఎల్) సిద్దమవుతోంది. ఈ నెల 5 నుంచి ఆటో ఎక్స్‌పో నోయిడాలో ప్రారంభమవుతుంది. ఈ ఎక్స్‌పోలో కంపెనీ అప్‌కమింగ్ మోడల్స్, లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించాలని ప్లాన్స్ వేస్తోంది. టక్సన్ లేటెస్ట్ వెర్షన్‌ను ఈ నెల ఐదున, క్రెటా మోడల్‌ను ఆరవ తేదీన ప్రదర్శించనుంది. ‘ఫ్రీడమ్ ఇన్ ఫ్యూచర్ మొబిలిటీ’ థీమ్‌తో 13 సరికొత్త మోడల్స్‌ను ప్రదర్శిస్తారు. ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న కంపెనీ ఎస్‌యూవీ ట్రెండ్ సెట్టర్ మోడల్స్ కూడా ఇందులో ఉంటాయని హ్యుండయ్ తెలిపింది.
