పిల్లలు ఎలాగంటే అలా ఎగిరి దుముకుతుండడం వల్ల వాళ్లు వేసుకునే బట్టల కుట్లు ఎక్కువసార్లు ఊడిపోతుంటాయి. కొన్ని సార్లు చిరిగిపోతాయి కూడా. అలాంటప్పుడు ఈ మెషిన్ ఉంటే టైలర్ దగ్గరికి పరిగెత్తకుండా ఇంట్లోనే కుట్లు వేసుకోవచ్చు. హైట్రల్ ఎలక్ట్రిక్ హ్యాండీ స్టిచ్ మెషిన్ని హైట్రల్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది పోర్టబుల్ సైజ్‌లో స్టేప్లర్ స్టయిల్లో వస్తుంది. దీంతో కుట్లు వేయడం చాలా సులభం. ముఖ్యంగా క్లాత్ బొమ్మలు, ప్యాచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ, టెర్రీ క్లాత్‌తో ఆర్ట్స్ క్రాఫ్ట్స్ తయారు చేయడం లాంటివి చేయొచ్చు. ఈ మెషిన్లో 4 AA బ్యాటరీలు వేసి లేదా ఈ మెషిన్‌తో పాటు వచ్చే ఎడాప్టర్ కనెక్ట్ చేసి కూడా వాడుకోవచ్చు.
ధర : 559 రూపాయలు
స్టిర్రింగ్ కాఫీ మగ్
కొందరికి పాలలో కాఫీ పొడి వేసుకుని బాగా కలుపుకుని తాగడం అలవాటు. కానీ.. కప్పులో పోసి ఎక్కువసేపు కలపాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అలాంటివాళ్ల కోసం ఇది బెస్ట్ కాఫీ మగ్. న్యాచ్కార్ట్ అనే కంపెనీ ఈ ఆటోమెటిక్ సెల్ఫ్ స్టిర్రింగ్ కాఫీ మగ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 400 మిల్లీలీటర్ల కాఫీ పడుతుంది. దీనిలోపల కాఫీని కలపడానికి ఒక చక్రం ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే ఆ చక్రం స్పీడ్‌గా తిరుగుతుంది. ఆ చక్రానికి ఫ్లూయిడ్ మోటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. దీన్ని కడగడం కూడా చాలా ఈజీ. కప్పులో నీళ్లు పోసి బటన్ నొక్కితే చాలు. ఇందులో రెండు AAA బ్యాటరీలు వేయాలి. దీన్ని హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు.
ధర : 399 రూపాయలు
లాంచ్ ప్యాడ్
మనం చేయలేని చాలా పనులను కంప్యూటర్ సాయంతో చేస్తుంటాం. అయితే.. ఆ పనులను కూడా ఇంకాస్త స్పీడ్‌గా చేయడానికి వీలుగా ఈ కాప్గెయిన్ హెచ్–3 స్ట్రీమ్ డాక్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది మల్టీ ఫంక్షనల్ గాడ్జెట్. కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి చాలా పనులను వేగంగా చేసుకోవచ్చు. ఇది కాంపాక్ట్ హై-పర్ఫార్మింగ్ స్ట్రీమ్ డాక్ అండ్ కనెక్టివిటీ హబ్‌గా పనిచేస్తుంది. 3.5-అంగుళాల టచ్ స్క్రీన్‌తో వస్తుంది. కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లు దీనిలో కూడా డిస్ప్లే అవుతాయి. ఒకే టచ్‌తో ఆ యాప్‌ని ఓపెన్ చేయొచ్చు. దీన్ని మల్టీఫంక్షనల్ కీబోర్డ్‌గా కూడా వాడొచ్చు. వన్-టచ్ కమాండ్ షార్ట్‌కట్స్ సెట్ చేసుకోవచ్చు. ఐకాన్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది. దీనికి హెచ్డీఎంతోపాటు యూఎస్బీ పోర్ట్‌లు కూడా ఉంటాయి. వాటిలో రెండు హై-స్పీడ్ యూఎస్బీ 3.0 ఇంటర్‌ఫేస్‌లు ఉన్నాయి. ఎస్డీ కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. డూప్లికేట్ స్క్రీన్ డిస్ప్లే మోడ్ ఉంటుంది. ఇది100 వాట్స్ ఛార్జింగ్ అవుట్‌పుట్ ఇస్తుంది. మొబైల్స్‌ని చాలా స్పీడ్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర : 11,000 రూపాయలు
నేచురల్ మౌత్ వాష్
ఈ డివైజ్‌తో క్షణాల్లో నీళ్లను శుభ్రం చేసుకోవచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన వాష్వావ్ కప్– 2లో నీళ్లను పోస్తే.. అది నీటిలో క్లోరిన్‌ను ఎలక్ట్రోలైజ్ చేసి హెచ్సీఎల్ఓని తయారుచేస్తుంది. ఇది నోట్లోని చాలా రకాల బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ నీళ్లతో ముఖ్యంగా దంత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజంతా తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది. చిగుళ్ల ఆరోగ్యానికి సాయపడుతుంది. చిగుళ్ల సమస్యలతో బాధపడేవారికి ఇది బెస్ట్ చాయిస్. టూత్ బ్రష్‌ని ఈ కప్‌లో వేస్తే క్షణాల్లో శుభ్రం చేస్తుంది. పళ్ల సెట్లను కూడా ఇందులో వేసి కడుక్కోవచ్చు. ఇది సీఈ, ఎఫ్‌సీసీ, ఈపీఏ సర్టిఫికెట్లు పొందింది. దీన్ని ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు.
ధర: 4,500 రూపాయలు