హైడ్రా ప్రజావాణి ప్రారంభం... మొదటగా వచ్చిన 50 మందికే టోకెన్స్..

నేటి ( జనవరి 6, 2025 ) నుంచి ప్రజావాణి నిర్వహించనుంది హైడ్రా..ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది.ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణల పై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరిస్తామని తెలిపారు కమిషనర్ రంగనాథ్. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు కమిషనర్. 

ప్రజావాణిలో ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో రావాలని.. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. టోకెన్ ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి పలువురు ఫిర్యాదుదారులు బుద్ధభవన్‎లోని హైడ్రా ఆఫీసుకు వచ్చి కమిషనర్‎ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని సందర్భాల్లో గంటలతరబడి కూడా వెయిట్​చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతివారం ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు హైడ్రా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

Also Read :- అమెరికాలో వెదర్ ఎమర్జెన్సీ.. మంచు తుఫానుతో గడ్డకట్టిపోతున్న జనం

ప్రతి సోమవారం ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు పూర్తి వివరాలు పొందుపర్చాలని.. ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌కు సంబంధించిన స‌‌‌‌ర్వే నంబర్లు, ఫొటోలు, ఇతర ఆధారాలుంటే జ‌‌‌‌త చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు కమిషనర్ రంగనాథ్. ఫిర్యాదులు అందిన తర్వాత ఆలస్యం చేయకుండా ఫీల్డ్‎కు వెళ్లి విచారణ జరిపి, నిజంగా ఆక్రమణ జరిగిందని తేలితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషనర్ రంగనాథ్.