YS జగన్‎కు హైడ్రా నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా స్టేట్‎లో హాట్ టాపిక్‎గా మారింది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఎవరూ అక్రమ కట్టడాలు చేపట్టిన హైడ్రా నేలమట్టం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన రాష్ట్రంలో హైడ్రాపైనే చర్చ జరుగుతోంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇటు సినీ, అటు పొలిటికల్ సర్కిల్స్‎లో ఒక్కసారిగా హైడ్రా పేరు మారు మోగిపోయింది. 

ప్రభుత్వ భూమి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‎ను అక్రమించింది సామాన్యుడైన సెలబ్రెటి అయిన హైడ్రా వదలదనే మెసేజ్ జనాల్లోకి గట్టిగా వెళ్లింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‎కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‎లోని జగన్ లోటస్ పాండ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని.. త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్‎ను కూల్చేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

Also Read :- తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఈ క్రమంలో వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డికు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని.. దానిని ఎవరూ నమ్మొద్దని సూచించారు. హైడ్రా ఇట్లాంటి నోటీసులు ఇవ్వదని.. అక్రమణ అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తోందని అన్నారు.