ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని కెనడాలో తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణం తీసుకున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు.
ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ప్రణయ్ కెనడాకు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయితే పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మరణానంతరం తన అవయవాలు దానం చేయాలని ప్రణయ్ లేఖలో రాశాడు. ప్రణయ్ ఆత్మహత్యకు సంబంధించి కెనడా అధికారులు మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
