సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో .. హైదరాబాద్ గెలుపు

రాజ్‌కోట్‌: ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (31 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 4 సిక్స్‌‌‌‌లతో 51 నాటౌట్‌‌‌‌), రోహిత్‌‌‌‌ రాయుడు (33 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 56 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌‌‌‌ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ నాలుగో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 9 వికెట్ల తేడాతో బీహార్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన బీహార్‌‌‌‌ 20 ఓవర్లలో 118/9 స్కోరు చేసింది. కుమార్‌‌‌‌ రజనీష్‌‌‌‌ (21) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సచిన్‌‌‌‌ కుమార్‌‌‌‌ (16), శర్మాన్‌‌‌‌ నిగ్రోద్‌‌‌‌ (14), సకీబుల్‌‌‌‌ ఘనీ (15) మోస్తరుగా ఆడారు. 

రవితేజ 4, మిలింద్‌‌‌‌, అజయ్‌‌‌‌ దేవ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత హైదరాబాద్‌‌‌‌ 12.3 ఓవర్లలో 119/1 స్కోరు చేసి నెగ్గింది. తన్మయ్‌‌‌‌ (8) ఫెయిలైనా.. తిలక్‌‌‌‌, రాయుడు ఈజీగా విజయాన్ని అందించారు. రవితేజకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌ 8 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌లో  కొనసాగుతోంది.  ఆదివారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది.