రాజ్‌కోట్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్లు అమన్ రావు (42 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67 నాటౌట్), రోహిత్ రాయుడు (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దంచికొట్టడంతో.. గురువారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో మిజోరాంపై నెగ్గింది.
టాస్ నెగ్గిన మిజోరాం 18.3 ఓవర్లలో 123 రన్స్‌కు ఆలౌటైంది. జెహు అండర్సన్ (33) టాప్ స్కోరర్. మోహిత్ జాంగ్రా (27), అగ్ని చోప్రా (15) ఫర్వాలేదనిపించినా మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రవితేజ, నితిన్ సాయి యాదవ్ చెరో మూడు, తిలక్ వర్మ రెండు వికెట్లు తీశారు. తర్వాత హైదరాబాద్ 11.4 ఓవర్లలో 127/0 స్కోరు చేసి గెలిచింది. అమన్ రావుకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.