ఏఐకి కేరాఫ్​ హైదరాబాద్​

ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్తపుంత‌‌‌‌లు తొక్కుతోంది.  రానున్నకాలంలో  ఏఐకి హైద‌‌‌‌రాబాద్  కేరాఫ్‌‌‌‌గా మారనుంది.  సరికొత్త  ఆవిష్కరణల‌‌‌‌తో  ప్రపంచానికి  ఆద‌‌‌‌ర్శంగా తెలంగాణ నిలవ‌‌‌‌నుంది.  ఐటీ విప్లవాన్ని నాడు అందిపుచ్చుకుంది హైద‌‌‌‌రాబాదే. 

 నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాన్ని తెలంగాణ‌‌‌‌ ముందుకు నడిపించే స్థాయికి ఎదిగింది. ఏఐ టెక్నాలజీ  ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతో  తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో  ప్రపంచ లీడర్‌‌‌‌గా చేసే ల‌‌‌‌క్ష్యంతో ముందుకు అడుగులు వేస్తోంది. 

గ్లోబల్ ఏఐ సమిట్ 2024కు  తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది.  ‘ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్సు’ అనే థీమ్‌‌‌‌‌‌‌‌తో  ఈ సదస్సు నిర్వహించింది.  హైదరాబాద్  అంతర్జాతీయ  కన్వెన్షన్ సెంటర్‌‌‌‌ (హెచ్ఐసీసీ)లో  సీఎం రేవంత్ రెడ్డి,  ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ స‌‌‌‌దస్సు రెండు రోజులపాటు విజ‌‌‌‌య‌‌‌‌వంతంగా జ‌‌‌‌రిగింది.  దీంతో దేశంలోనే  గ్లోబల్  ఏఐ సమిట్‌‌‌‌ను నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చోటు ద‌‌‌‌క్కించుకుంది.  

ఫ్యూచ‌‌‌‌ర్  సిటీలో  ఏఐ సిటీ

అంత‌‌‌‌ర్జాతీయంగా ఏఐ ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం కన్నా ఎక్కువ‌‌‌‌ అమెరికా,  చైనా దేశాల‌‌‌‌కే పోతుంది.  ఇదే విష‌‌‌‌యాన్ని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్‌‌‌‌జానీ ఘోష్  స్పష్టం చేశారు. 2030 నాటికి  అంత‌‌‌‌ర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో  ఏఐ  భాగ‌‌‌‌స్వామ్య ఆదాయం 15.7  ట్రిలియ‌‌‌‌న్ డాల‌‌‌‌ర్లకు చేరుకోనుంది.  ఈ ప‌‌‌‌రిస్థితుల్లో  ప్రపంచంలో  స‌‌‌‌మీకృత అభివృద్ధి  న‌‌‌‌మూనా కోసం  మిగ‌‌‌‌తా దేశాలు భార‌‌‌‌త్ వైపు చూస్తున్నాయి.  దీనిని అందిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  సారథ్యంలోని  తెలంగాణ ప్రభుత్వం కృత‌‌‌‌నిశ్చయంతో ఉంది.  ఐటీ,  ఫార్మా,  ఇత‌‌‌‌ర‌‌‌‌  పారిశ్రామిక రంగాల‌‌‌‌లో  రాణిస్తున్న తెలంగాణ‌‌‌‌ను  ఏఐ విప్లవంలోనూ భాగ‌‌‌‌స్వామ్యం చేసేందుకు రేవంత్​ సర్కార్​ కృషి చేస్తున్నది.  భ‌‌‌‌విష్యత్తులో  మాన‌‌‌‌వ మేధ‌‌‌‌స్సు  క‌‌‌‌న్నా  బ‌‌‌‌ల‌‌‌‌మైన  కృత్రిమ మేధ వ‌‌‌‌చ్చే అవ‌‌‌‌కాశాలున్నాయ‌‌‌‌ని  ఎక్స్‌‌‌‌ప్రైజ్  ఫౌండేష‌‌‌‌న్  ఎగ్జిక్యూటివ్  చైర్మన్​ పీట‌‌‌‌ర్  డైమండిస్ పేర్కొన్నారు.  నాలుగో న‌‌‌‌గ‌‌‌‌రం (ఫ్యూచ‌‌‌‌ర్ సిటీ)లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేసేందుకు  ప్రభుత్వం ఇప్పటికే  కార్యాచరణను  రూపొందించింది.  ఏఐ రంగంలో  నూత‌‌‌‌న  ఆవిష్కరణలకు  తొలి ప్రాధాన్యమివ్వనున్నారు.  ఇది ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తోడ్పడనుంది.  ఈ ప్రాజెక్ట్   తెలంగాణను  గ్లోబల్  ఏఐ  చుక్కానిగా  నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూటర్ ఫెసిలిటీస్,  విస్తృత  డేటా సెంటర్లు,  సుస్థిర  కనెక్టివిటీని అందించ‌‌‌‌నున్నాయి.  ఇదే  ఏఐ సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్​లెన్స్ ప్రారంభించడా
నికి కూడా  ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

స్థానిక భాష‌‌‌‌ల్లో వాయిస్ ఆధారిత సేవ‌‌‌‌లు

తెలంగాణ స‌‌‌‌ర్కార్ ఐటీ  విస్తృత అభివృద్ధిలో భాగంగానే  ఏఐపై అంత‌‌‌‌ర్జాతీయ స‌‌‌‌ద‌‌‌‌స్సును నిర్వహించింది.  ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు.  దేశంలో స్థానిక భాష‌‌‌‌ల్లో వాయిస్ ఆధారిత సేవ‌‌‌‌లు అందుబాటులోకి వ‌‌‌‌చ్చిన‌‌‌‌ప్పుడే అంద‌‌‌‌రికీ ఏఐ ల‌‌‌‌క్ష్యం నెర‌‌‌‌వేరుతుంద‌‌‌‌ని కేంద్ర ఐటీ శాఖ అద‌‌‌‌న‌‌‌‌పు కార్యదర్శి అభిషేక్ సింగ్ పేర్కొన్నారు.  దీనిలో భాగంగా 25 ఏఐ ఆధారిత అప్లికేష‌‌‌‌న్లు సిద్ధం చేశామ‌‌‌‌న్నారు. స్థానిక భాష‌‌‌‌ల్లో టూల్స్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌ముంద‌‌‌‌నేది మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయ‌‌‌‌ప‌‌‌‌డ్డారు. దీంతో  ఎక్కువమందికి ఏఐ సేవ‌‌‌‌లు అందుతాయ‌‌‌‌నేది వారి ఆలోచ‌‌‌‌న‌‌‌‌. ఏఐ ఆవిష్కరణల విష‌‌‌‌యంలో దూర‌‌‌‌దృష్టితో కూడిన విధానం అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మ‌‌‌‌ని ప్రపంచ బ్యాంకు సీనియ‌‌‌‌ర్  ప‌‌‌‌బ్లిక్ సెక్టార్  స్పెష‌‌‌‌లిస్టు  కింబెర్తి జాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

పలు ఒప్పందాలు కుదిరాయి

నాస్కామ్ స‌‌‌‌హ‌‌‌‌కారంతో రాష్ట్రంలో ఏఐ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన జ‌‌‌‌రుగుతోంది.  నూత‌‌‌‌న ఆవిష్కరణల దిశ‌‌‌‌గా పారిశ్రామిక‌‌‌‌వేత్తలు,  నిపుణుల‌‌‌‌తో క‌‌‌‌లిసి రాష్ట్ర  ప్రభుత్వం ప‌‌‌‌నిచేస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ ఏఐ సదస్సులో  విద్యా సంస్థలు, దిగ్గజ సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలతో ఒప్పందాలను చేసుకుంది.  దేశంలో తెలంగాణను ఏఐలో  సూపర్ పవర్​గా తీర్చిదిద్దేందుకు అవసరమైన పలు అంశాలలో  ఒప్పందాలు కుదిరాయి. 

5వేల మంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ

 ప్రధానంగా కంప్యూటర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్,  స్కిల్లింగ్,  స్టార్టప్  ఇన్నోవేషన్,  జనరేటివ్ ఏఐ,  రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా అన్నోటేషన్ వంటి 7 రంగాలలో ఒప్పందాలు చేసుకోవడం సరికొత్త ఆవిష్కరణలకు నాంది  పలకనుంది.  ప్రజారోగ్యం,  ఈ-–స్పోర్ట్స్,  మొబైల్ గేమింగ్,  ఇంటరాక్టివ్ మీడియా,  డిజిటల్ కంటెంట్లో ఆవిష్కరణలు, విధాన రూపకల్పనలపై  దృష్టి సారించనున్నాయి.  యువతలో ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కోసం.. నెక్ట్స్‌‌‌‌వేవ్, అమెజాన్  వెబ్ సర్వీసెస్,  మైక్రోసాఫ్ట్​ సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో 2.5 లక్షల మంది నిపుణులకు, విద్యార్థులకు  ప్రయోజనం కలగనుంది.  ఏఐ సాంకేతికతలను ఉపయోగించి ఈ-–గవర్నెన్స్,  పౌర సేవలను మెరుగుపర్చేందుకు  ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే  మెటాతో  జరిగిన ఒప్పందంతో లామా 3.1 మెడల్‌‌‌‌తో సహా మెటా  ఓపెన్ సోర్స్ జనరేటివ్  ఏఐ సాంకేతికతలతో  ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం మరింతగా మెరుగుపడనుంది. రాష్ట్రంలోని 200 సాంకేతిక,  ఉన్నత  విద్యాసంస్థల నుంచి 5వేల మంది విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందనున్నారు.

వేగంగా  పురోగమిస్తున్న  రాష్ట్ర జీఎస్డీపీ

తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్) స్పష్టం చేసింది.  ప్రస్తుతం  జీఎస్డీపీ 176 బిలియన్ డాలర్లు ఉంది.  రానున్న 12 ఏండ్లల్లో  అది భారీగా వృద్ధి చెందనుంది.  దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 4.9 శాతం ఉండగా  2032 నాటికి  7.73 శాతానికి చేరుతుంది. అదేవిధంగా 2036 నాటికి 9.3 శాతానికి చేరుకుంటుంది. 140 కోట్ల దేశ జనాభాలో  కేవలం 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ అద్వితీయంగా పురోగమిస్తోంది.  తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం తనదైన శైలిలో  దూసుకెళ్తుందని  గ్లోబల్ ఏఐ సమిట్ వేదికగా  వరల్డ్ ట్రేడ్  సెంటర్ ప్రకటించింది. ఇదే వేదికపై  ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు  తెలంగాణ పేరిట విడుదల చేసిన నివేదికలో అనేక విషయాలను వెల్లడించింది. 

తెలంగాణకు వరల్డ్​ ట్రేడ్​ సెంటర్ ​ప్రశంస

దేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 2,485 డాలర్లు ఉండగా,  తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు దీనికి రెండు రెట్లుగా  4,466 ఉంది.  2036 నాటికి దేశ తలసరి ఆదాయం 4,160 డాలర్లకు పెరిగితే.. తెలంగాణ తలసరి ఆదాయం 12,690 డాలర్లకు చేరుకుంటుంది. అన్నింటికి మించి రాష్ట్ర ఆర్థిక ఇంజిన్​కు సేవారంగం చోదకశక్తిగా ఉంది.  ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడంలో ఇది ప్రధాన భూమికను పోషించనుంది. కాగా, ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ద్వారా కంపెనీలు భారీగా లబ్ధి పొందడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.  రానున్న పదేండ్లలో   తెలంగాణ  దేశంలో  అన్ని రంగాలలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలవనుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం  స్పష్టం చేసింది. 

- డా. ఎన్.యాదగిరిరావు అద‌‌‌‌న‌‌‌‌పు క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్‌‌‌‌, జీహెచ్ఎంసీ