హైదరాబాద్లోని వైట్​హౌస్​హోటల్​లో మంటలు

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పరిధి కుందన్​బాగ్​సమీపంలోని వైట్​హౌస్​హోటల్​లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్​లో వంట చేస్తుండగా, నూనె పైకి ఎగసి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సికింద్రాబాద్​ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.