యువతిపై లైంగిక వేధింపులు..అడ్డుకున్న పోలీస్ అధికారిణిపై దాడి..టెక్కీ అరెస్ట్

యువతిపై లైంగిక వేధింపులు..అడ్డుకున్న పోలీస్ అధికారిణిపై దాడి..టెక్కీ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరికి చెందిన ఓ యువతి హైదరాబాద్ లో ఓ శుభకార్యానికి అటెండ్ అయ్యింది. శుభాకార్యం ముగించుకొని తిరిగి హైదరాబాద్ ను వెస్ట్ గోదావరికి వెళ్లేందుకు అమీర్ పేట్ కేఎల్ ఎస్ బస్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి మహేష్.., బస్టాప్ లో సదరు యువతి చేయి పట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని వేధిస్తున్నటెక్కీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీస్ అధికారి శైలు పై దాడి చేశాడు. ఆమె కాలర్ పట్టుకొని పక్కకు నెట్టడంతో ఈ దాడిలో పోలీస్ అధికారి స్వల్పగాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది నిందితుణ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. నిందితుడు మహేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.